- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియో-బీపీ తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైన రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బీఎంఎల్) మంగళవారం తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్‌ను నవీ ముంబైలో ప్రారంభించింది. ఈ స్టేషన్ ద్వారా వినియోగదారులకు పలు రకాల ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఇప్పుడున్న 1400 ఇంధన స్టేషన్లను జియో-బీపీ మొబిలిటీ కింద రీబ్రాండ్ చేయనున్నట్టు రిలయన్స్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను కూడా ఈ మొబిలిటీ స్టేషన్లలో అందుబాటులో వస్తాయని పేర్కొంది.
దేశీయంగా ఇంధన, మొబిలిటీ మార్కెట్ శరవేగంగా పెరుగుతోందని, ఇకపై మరిన్ని సేవలను అందిస్తామని సంస్థ వివరించింది. మరో 20 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధనాల మార్కెట్‌గా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు పనిచేయనున్నాయి. భవిష్యత్తులో ఈ జాయింట్ వెంచర్ ద్వారా ప్రముఖ ఈవీ ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.