రైట్స్ ఇష్యూ…రిలయన్స్ 30 ఏళ్లలో మొదటిసారి!

by Harish |
రైట్స్ ఇష్యూ…రిలయన్స్ 30 ఏళ్లలో మొదటిసారి!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంస్థను రుణ రహిత కంపెనీగా మార్చాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో సేల్స్‌కు, వ్యూహాత్మక ఒప్పందాలకు సిద్ధమైన ముఖేశ్ దాదాపు 30 ఏళ్ల తర్వాత అరుదైన నిర్ణయం తీసుకోనున్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా షేర్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 30న(నేడు) జరగబోయే డైరెక్టర్ల బోర్డ్ పరిశీలనలో ఉంది. మార్చి 31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఫలితాల, ఆమోదం కోసం గురువారం డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చివరి డివిడెంట్‌ను బోర్డు సిఫార్సు చేస్తుంది. అంతేకాకుండా, నిర్దేశిత నియంత్రణ సంస్థల అనుమతులు, ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ప్రాతిపదికన ఈక్విటీ షేరల్ను జారీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

రైట్స్ ఇష్యూ ద్వారా 5 శాతం వరకూ వాటా షేర్లను జారీ చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈ రైట్స్ ఇషుయూ వల్ల రిలయన్స్ సంస్థకు రూ. 40,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. గతంలో రిలయన్స్ 1991 ఏడాదిలో నిధుల సమీకరణకు వెళ్లింది. మళ్లీ ఈ ఏడాది రైట్స్ ఇష్యూకు వెళ్తోంది. సంస్థలు సాధారణంగా ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన నిధుల కోసం రైట్స్ ఇష్యూను ప్రకటిస్తాయి. రిలయన్స్ గడిచిన కొద్ది వారాల్లో ఫండ్ రైజింగ్ కోసం ప్రయత్నించడం ఇది మూడవసారి. ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకోవడంతో రూ. 43 వేల కోట్ల నిధులను సమకూర్చుకుంది. దీనికిముందు బీపీ, సౌదీ ఆరామ్‌కో నుంచి నిధులను సేకరించడాన్నికి ప్రయత్నించింది. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 40,000 కోట్ల నిధులు సమకూరుతాయనేది సంస్థ అంచనా. 2019 డిసెంబర్ నాటికి రిలయన్స్‌కు ఉన్న రుణభారం రూ. 3,06,851 కోట్లు. నగదుతో పాటు నగదు సమానమైన నిల్వలు రూ. 1,53,719 కోట్లు ఉన్నాయి. మొత్తం నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లు. జియో, ఫేస్‌బుక్ వాటా రూ. 43,574 కోట్లు, రిటైల్ విభాగంలో సగం వాటా బీపీకి రూ. 7 వేల కోట్లు, టెలికాం టవర్ బిజినెస్‌ను 25,200 కోట్లకు అమ్మేసింది. ఆయిల్‌ కెమికల్‌ బిజినెస్‌లో 20% వాటా ను సౌదీ ఆరామ్‌కో కంపెనీకి అమ్మెందుకు గత ఏడాది ఆగష్టులో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీలన్నింటితో రుణభారాన్ని తగ్గించుకోవాలని రిలయన్స్‌ భావిస్తోంది.

Tags: Ril, Rights Issue, Mukesh Ambani, Debt

Advertisement

Next Story