- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
131 రోజుల ముందే జననం.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన బుడ్డోడు
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన బెత్, రిక్ హచిన్సన్ దంపతులకు నెలలు నిండకముందే జన్మించి బతికిన శిశువుగా ‘విలియం’ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో అత్యంత తక్కువ రోజులు కేవలం 21 వారాల రెండు రోజులకే పురుడుపోసుకున్న ఈ బాలుడు 2020 జూన్ 5న జన్మించాడు. అయితే నెలలు నిండని ‘రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్’ను వైద్యులు బతకడం కష్టమని తేల్చారు. కానీ మరణంతో పోరాడుతూనే, తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఏడాది పూర్తి చేసుకున్న రిచర్డ్ మృత్యుంజయుడిగా నిలిచి ఫస్ట్ బర్త్‌డే కంప్లీట్ చేసుకున్నాడు.
రిచర్డ్ స్కాట్ కేవలం 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవుతో జన్మించాడు. అక్టోబర్‌లో డెలివరీ డేట్ ఇవ్వగా, తల్లి ఆరోగ్య సమస్యల కారణంగా 131 రోజుల ముందే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలో గతంలో కెనడాలోని ఒట్టావాలో బ్రెండా, జేమ్స్ గిల్ దంపతులకు జన్మించిన(1987, మే 20) జేమ్స్ ఎల్గిన్ గిల్ పేరిట ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను రిచర్డ్ బద్దలు కొట్టాడు. జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల 5 రోజులు మాత్రమే ఉండగా, రిచర్డ్ అతడికి కంటే మూడు రోజుల ముందే పుట్టడంతో ప్రిమెచ్యూర్ రికార్డ్ బేబీగా నిలిచాడు. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఈ రికార్డ్‌ను గుర్తించింది.
‘ఈ నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మా బాబు పోరాటం నిజంగా ఓ అద్భుతం. దానికి మేము సంతోషంగా ఉన్నాం. ప్రిమెచ్యూర్ జననాల గురించి అవగాహన పెంచడానికి అతడి కథను షేర్ చేసుకోవడం చాలా ముఖ్యం’ – బెత్, రిచర్డ్ తల్లి
‘సాధారణంగా ఓ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటలకు రావడానికి 40 వారాల సమయం పడుతుంది. కాని రిచర్డ్ స్కాట్ నెలలు నిండకుండానే జన్మించడంతో అతడి తల్లిదండ్రులకు నియోనాటాలజీ బృందం తరఫున కౌన్సెలింగ్ ఇచ్చి ఆశలు వదిలివేసుకోమని చెప్పాం. ఒకవేళ రిచర్డ్ ఆరోగ్యం సహకరించినా.. తన జీవితంలో మొదటి కొన్ని వారాలు చాలా కష్టమవుతాయని మాకు తెలుసు. కానీ తను ప్రాణాలతో బయటపడతాడని మేము భావించాం. అతన్ని కంటికిరెప్పలా దాచుకున్న తల్లిదండ్రులకు, అందుకు సహకరించిన చిల్డ్రన్స్ మిన్నెసోటాలోని మొత్తం నియోనాటాలజీ బృందానికి నా అభినందనలు
– నియోనాటాలజిస్ట్ డాక్టర్ స్టేసీ కెర్న్