పిల్లల్ని ఇంట్లో వదిలి.. హనీమూన్‌కు అనిల్ కపూర్ కూతురు

by Shyam |
reha-kapoor
X

దిశ, సినిమా : అనిల్ కపూర్ కూతురు రియా కపూర్‌.. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ కరణ్ బూలానిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత మాల్దీవ్స్ వెళ్లిన న్యూ కపుల్, అక్కడ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తమ రొమాంటిక్ గెటప్‌ నుంచి ఒక పిక్ షేర్ చేయగా, రియా మెరూన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో కనిపించింది. ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో కరణ్ కూడా ఉన్నాడు. అయితే ఈ పోస్టుకు ‘పిల్లల్ని నాని ఇంట్లో వదిలేశాం’ అని క్యాప్షన్ యాడ్ చేయడమే పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఇక్కడ పిల్లలంటే వారి పెంపుడు కుక్కలు ‘రస్సెల్ క్రో కపూర్, లెమన్’ అని తర్వాత తెలిసింది. కానీ ఇది తెలియనివారంతా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యపోతున్నారు. మీకు పిల్లలు ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

రియా, కరణ్ మ్యారేజ్.. అనిల్ కపూర్ ఇంట్లో ఆగస్టు 14న అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు 12 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ మొదటిసారిగా రియా ప్రొడ్యూస్ చేసిన ‘అయేషా’ మేకింగ్‌లో కలుసుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాకు కరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

Advertisement

Next Story

Most Viewed