ఫ్రెండ్లీ పోలీస్ వార్నింగ్ సాంగ్ పై ఆర్జీవీ ట్వీట్

by vinod kumar |   ( Updated:2020-04-15 06:03:07.0  )
ఫ్రెండ్లీ పోలీస్ వార్నింగ్ సాంగ్ పై ఆర్జీవీ ట్వీట్
X

తెలంగాణ పోలీసుల కర్తవ్య దీక్షకు సలాం చేస్తున్నారు ప్రముఖులు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో … కరోనా చైన్ బ్రేక్ చేసేందుకు వారు చేస్తున్న కృషికి ఖుదోస్ అంటున్నారు. కానీ కొంత మంది మాత్రం పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా … ఇంటి పట్టున ఉండకుండా… బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారకులు అవుతున్నారు. అలాంటి వాళ్లకు అవగాహన కల్పించేందుకు ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ పాట రాశాడు. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. నా ఫ్రెండ్, ఫ్రెండ్లీ పోలీస్ లాల్ మదర్ ఈ పాటను రాశాడని చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ పాటను రిలీజ్ చేసింది రీల్ హీరో కాదని… రియల్ హీరో గ్రేట్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అని తెలిపాడు. తప్పకుండా అందరూ వినాల్సిన పాట అని తెలిపాడు ఆర్జీవీ.

ఓరోరి ఓరి నా ఫ్రెండ్ చెప్పినట్టు దూరంగా ఉండు… చేతులంట కడుగుతూ ఉండు… ఇంట్లనే తినుకుంట పండు… ఇనకుంటే నీ లైఫ్ ఎండ్… అంటూ సాగే పాటలో పోలీసులు, డాక్టర్లు ప్రజల కోసం కష్టపడుతుంటే కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని తమదైన శైలిలో చెప్పారు.

Tags : RGV, Friendly police Song, Tweet, Cyberabad Police

Advertisement

Next Story

Most Viewed