'దిశ' పుట్టింది… చెన్నకేశవులు నీడ వెంటాడుతోంది : ఆర్జీవీ

by Shyam |
దిశ పుట్టింది… చెన్నకేశవులు నీడ వెంటాడుతోంది : ఆర్జీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ హత్య కేసులో ఎన్‌కౌంటర్ చేయబడిన నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నా… వారి భవిష్యత్ మాత్రం బాగోలేదని ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరి జీవితాలను రేపిస్ట్ చెన్నకేశవులు గతం వెంటాడుతుందన్నాడు. ఆర్థికంగా చితికిపోయిన రేణుకకు, తన బిడ్డకు మీ వంతు సాయం చేయాలని కోరాడు. కాగా… దిశ సినిమాను తీసే ప్రయత్నంలో ఉన్న ఆర్జీవీ… ఈ క్రమంలో చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు. తన ఆర్థిక స్థోమత గురించి తెలుసుకుని తన వంతు సాయం చేశాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత మందికి నష్టం జరుగుతుందో తెలుసుకున్నాను అని… అలా జీవితాన్నే నష్టపోయిన రేణుకకు సాయం చేయాలని మీడియా ముందుకు వచ్చాడు. ఆ టైంలో ఆర్జీవీలోని ఈ జాలి, కరుణ కోణాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోయాడు కూడా. కాగా తన భర్త వల్ల నరకం అనుభవించి చనిపోయిన ‘దిశ’ పేరునే తనకు పుట్టబోయే బిడ్డకు పెట్టుకుంటానని అప్పుడే చెప్పింది రేణుక.


Tags: Disha, Disha Case, RGV, Renuka, Chennakeshavulu, Ram Gopal Varma

Advertisement

Next Story

Most Viewed