- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏం చెప్పావు.. ఏదో తీశావ్!
వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ పవర్‌స్టార్ ఫ్యాన్స్‌తో వార్ పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ కథను సినిమా కథగా తీసుకున్న వర్మ.. సినిమా షురూ చేసినప్పటి నుంచి రోజుకో వివాదాన్ని తెరమీదకు తెచ్చి మంచి ప్రమోషన్ చేసుకున్నాడు. పవర్‌స్టార్ టైటిల్‌తో సినిమా తీసిన వర్మ.. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. ఆ వివాదం కాస్తా ముదిరి ఆర్జీవీ కార్యాలయంపై దాడి వరకు వెళ్లింది. అసలు సినిమాను రిలీజ్ చేయనివ్వమని పికే ఫ్యాన్స్ సవాలు విసిరినా.. చెప్పిన టైమ్‌కు ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో సినిమా రిలీజ్ చేసి చూపించాడు. సినిమా విడుదలైన గంటలో ట్వీట్ చేసిన వర్మ.. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పవర్‌ఫుల్ హిట్.. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, ఇండస్ట్రీ చేంజర్’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు.
https://twitter.com/RGVzoomin/status/1286916037317758976?s=19
కానీ సినిమాలో ఏదో చూపిస్తున్నానని భారీ హైప్ క్రియేట్ చేసిన ఆర్జీవీ.. చివరకు ఓ అరగంట సినిమా మాత్రమే చూపించాడని పైసలు పెట్టి మరీ సినిమా చూసిన ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. సినిమాలో ఉన్నదంతా ట్రైలర్‌లోనే చూపించాడని, కొత్తగా సినిమాలో చూపించిందేమీ లేదంటున్న ప్రేక్షకులు.. చివరగా ఓ ఎనిమిది నిమిషాల పాటు ఆర్జీవీ గీతోపదేశం చేశాడని చెప్తున్నారు.
ఇక సినిమా చూసిన మరికొందరు.. ఆర్జీవీ నిజమైన పవర్‌స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడని అంటున్నారు. పవర్‌స్టార్‌కు సినిమాలో మంచి సూచనలు చేశారని చెప్తున్నారు.