వైజాగ్ మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లా

by srinivas |
వైజాగ్ మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లా
X

విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలో నిన్న చోటుచేసుకున్న దుర్ఘటన మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో గాలే గరళమైన ఘటన ఆందోళన కలిగించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి సమీపంలోని ప్రజలు ఒక్కసారిగా కళ్లమంటలతో అల్లాడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. మరికొందరు పోలీసు, రెవెన్యూ సిబ్బందికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటన ఆందోళనల నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గాలి కలుషితం కావడం వల్లే కళ్లు మండుతున్నట్టు గుర్తించారు. ఏలూరు సాగునీటి కాలువలోకి వదిలిన వ్యర్థాల వల్లే గాలి కలుషితం అయిందని స్థానికులు మండిపడుతున్నారు. దీనికి కారణాలు అన్వేషిస్తున్నారు.

tags: west godavari district, air pollution, police,

Advertisement

Next Story

Most Viewed