- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ట్వీట్.. ఏం అడిగారంటే.?
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పలు అంశాలను వివరిస్తూ ట్వీట్ చేశారు. మల్కాజ్‌గిరి కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలంటూ ట్విట్టర్లో కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీగా, ఓ ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతగా కంటోన్మెంట్ బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశామని, కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని 15 రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ పనులు కూడా చురుగ్గానే సాగుతున్నాయని వివరించారు.
I request @kishanreddybjp to speed up the process initiated for a oxygen plant at #MalkajgiriCovidHospital I have already taken up this issue with @drharshvardhan,with director &chairman DRDO.With your visit to the premises today I hope the process completes ASAP to serve people pic.twitter.com/EmKaad8rkZ
— Revanth Reddy (@revanth_anumula) May 12, 2021
ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం అత్యంత కీలకమని, పీఎం కేర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి, డీఆర్‌డీవో చైర్మన్‌కు కూడా లేఖలు రాసినట్లు రేవంత్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ట్విట్టర్ వేదికగా రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.