హుజురాబాద్ అభ్యర్థిపై తెగని లొల్లి.. మళ్లీ సీల్డ్ కవరే దిక్కు!

by Anukaran |   ( Updated:2021-08-30 21:44:39.0  )
Gandhi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ సీల్డ్​కవర్ రాజకీయాలు మొదలయ్యాయి. హుజురాబాద్​ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి పేరును రాష్ట్రం నుంచి ఢిల్లీకి సీల్డ్​కవర్‌లో పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి సోమవారం అభ్యర్థి ప్రకటన ఉంటుందని పార్టీ శ్రేణులకు సమాచారమందించారు. కానీ కొండా సురేఖ అభ్యర్థిత్వంపై పలువురు మద్దతు, ఇంకొందరు వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించడంతో అధిష్టానం నుంచి పేరును ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్​మాణిక్కం ఠాగూర్‌కు సీల్డ్​ కవర్‌ను అందించారు. ముందుగా నాలుగైదు పేర్లను పరిగణలోకి తీసుకున్నా.. సీల్డ్ కవర్‌లో మాత్రం ఒక్కరి పేరునే ప్రతిపాదించినట్లు సమాచారం.

‘కొండా’కే సపోర్ట్​

ఆదివారం కరీంనగర్‌లో అక్కడి జిల్లా నేతలతో సమావేశమైన ఠాగూర్.. సోమవారం గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, గజ్వేలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం ఇప్పటికే కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లతో ఎన్నికల నిర్వహణ కమిటీ ఠాగూర్‌కు జాబితా అందించింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు పేర్లపై నేతల అభిప్రాయాన్ని ఆయన సేకరించారు. ఈ సమావేశంలో కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.

ఎక్కువ మంది కొండా సురేఖ పేరును సూచించినా.. ఉప ఎన్నిక తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందనే అంశంపై చర్చించారు. కాగా మెజారిటీ నేతల అభిప్రాయాన్ని క్రోడీకరించి సీల్డ్​కవర్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపిస్తున్నట్లు ఠాగూర్ పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ సమావేశంలో దాదాపుగా కొండా సురేఖ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీల్డ్ కవర్‌లో కూడా సురేఖ పేరును మాత్రమే పంపించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed