‘జగన్ జలదోపిడీ.. కేసీఆర్ కుట్ర’

by Anukaran |
‘జగన్ జలదోపిడీ.. కేసీఆర్ కుట్ర’
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!? జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరించి, విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పాం. జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోంది. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి’ అంటూ ఆయన డిమాండ్ చేశారు.

మరో ట్వీట్ చేస్తూ.. ‘శ్రీశైలం విద్యుత్ కేంద్రం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి. కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఘటన పై అనుమానాలు ఉన్నందున సీబీఐ తో విచారణ జరిపించాలి.’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story