- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ ఆదేశాలతో బీజేపీలోకి ఈటల’.. బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి పంపిందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడంలో చొరవ తీసుకున్నది కూడా ఆయనేనని పీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే రెవెన్యూ అధికారులతో కమిటీలు వేసి దర్యాప్తు హడావిడి చేసిన కేసీఆర్.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన వెంటనే ఆపివేయించారని ఆరోపించారు. ఇప్పటివరకూ ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచన ఉన్నట్లు తనకు తెలియదని, తనతో ఏనాడూ సంప్రదింపులు జరపలేదని అన్నారు. కేసీఆర్ దళితబంధు సంగతి ఎలా ఉన్నా ఆయన దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలోని దళితవాడ ఏ మాత్రం అభివృద్ధి చెందిందో మూడు రోజులు అక్కడే ఉండి బయటపెడతానని అన్నారు. మీడియాతో ఆదివారం చిట్‌చాట్ సందర్భంగా పై వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక అంశాలపై మాట్లాడారు.
బీజేపీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది, ఆయన ఢిల్లీ వెళ్ళడానికి వాడిన ఫ్లైట్, ఆ తర్వాత కిషన్‌రెడ్డికి ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే కిషన్‌రెడ్డికి ప్రైవేట్ జెట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చి రైట్ వాసనే పడని అయన ఇప్పుడు ఏకంగా కమలం రంగు పులుముకొని తిరుగుతున్నాడని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన వెంటనే ఆయన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు నిలిచిపోయిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామాంలోనే దీక్షలో కూర్చుంటానని, రెండు రోజులు అక్కడ కూర్చుంటే కేసీఆర్ ఆ గ్రామాన్ని ఎంత బంగారంగా మార్చారో తెలుస్తుందన్నారు. ఆ రెండు రోజులు దళితుల ఇంటి వాకిట్లోనే పడుకుంటానని అన్నారు. మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నా ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. దత్తత గ్రామాల్లోని దళిత వాడలను అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తారా అనే అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా తీసుకున్నారనే విషయంలో దళిత అంశాన్ని తెరపైకి తేవడం అంటే దళితులను అవమానించడమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. అది ఒక గొప్ప నిర్ణయమంటూ టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం దారుణమన్నారు. రాహుల్ బొజ్జాకు అర్హత ఉందని, సీఎంవోలో ఉన్న అధికారులంతా సీఎం చెప్పినట్లే చేయాల్సి ఉంటుందన్నారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ చేతిలో బలి అయ్యారని గుర్తుచేశారు.
హుజూరాబాద్ అభ్యర్థిపై త్వరలో క్లారిటీ
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారో కమిటీ బాధ్యుడిగా దామోదర రాజనరసింహ చూసుకుంటారని, ప్రచారం మొదలు అభ్యర్థి సెలక్షన్ వరకు అన్నీ ఆయనదే బాధ్యతన్నారు. పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి చేసే సిఫారసు మేరకు దామోదర నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం ఫైనల్ చేస్తుందన్నారు. ఏఐసీసీకి నివేదిక ఇవ్వడం వరకే పీసీసీ ప్రమేయం అని, ఆ తర్వాత నిర్ణయం హై కమాండ్ చూసుకుంటుందన్నారు. ఎవరినో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ సత్రాన్ని నడపడం లేదని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే రాజకీయాలు చేస్తుందన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా పార్టీల సిద్ధాంతలపై చర్చ జరగడం లేదని, ఎంత పంచాం, ఎంత మందిని కొన్నాం అనేదే ప్రధానమైపోయిందన్నారు. అభివృద్ధి, అవినీతి, ఐడియాలజీ లపై చర్చలే లేవన్నారు. గజ్వేల్‌కు ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేసే అంశాన్ని పార్టీ ముందు పెడతానని అన్నారు. కేసీఆర్ పాలనలో దగాకు, దోపిడీకి గురైంది దళిత, గిరిజనులేనని, ఆ పాపాన్ని పరిహారం చేసుకోడానికి ఎన్ని చేసినా తక్కువేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను హరితహారం పేరుతో గుంజుకుంటున్నారని, మేకలిస్తా అని యాదవులను, చేపలిస్తామని బెస్తవాళ్లను, రిజర్వేషన్లు ఇస్తానని మైనార్టీ, గిరిజనులను, ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇస్తానని విద్యార్థులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
మోసం, కేసీఆర్ అవిభక్త కవలలని అభివర్ణించారు. కేసీఆర్ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత త్వరలోనే తప్పకుండా బయటపడుతుందన్నారు. దళిత బంధు అద్భుతమైన పథకమంటూ టీఆర్‌ఎస్‌కు చెందిన వంద మంది ఎమ్మెల్యేలను తిరగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. హుజురాబాద్‌లో ఇప్పుడు ఇస్తున్న దళితబంధును మిగిలిన నియోజకవర్గాల్లో ఎప్పుడు అమలు చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మంచి అధికారిగా గుర్తింపు పొందారని, రాజకీయంగా ఆయనొక నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్ లాగానే బీఎస్పీ కూడా జాతీయ పార్టీ అని అన్నారు.
జాతీయస్థాయిలో జరిగే నిర్ణయాలకు అనుగుణంగా ఏకాభిప్రాయ అంశాలపై ఎవరొచ్చినా కలుపుకుపోతామన్నారు. ఉన్మాదులు చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్లి రేప్ చేసినట్లు కౌశిక్ రెడ్డిని కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయన్నారు. సెప్టెంబర్ 17లోపు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని తెలిపారు.