- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
79 శాతం పడిపోయిన రిటైల్ అమ్మకాలు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో రిటైల్ అమ్మకాలు 2019 కరోనా ముందునాటితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 79 శాతం పడిపోయాయి. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు మూసేయడం వల్లనే ఈ స్థాయి క్షీణత నమోదైనట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ-రాయ్) నివేదిక తెలిపింది. విభాగాల వారీగా చూస్తే.. ఆహార పదార్థాలు, కిరాణా సరుకుల విభాగంలో అమ్మకాలు 34 శాతం క్షీణించగా.. రెస్టారెంట్ల వంటి సేవల విభాగంలో అమ్మకాలు 70 శాతం పడిపోయాయి. ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ, అందం విభాగాల్లో 87 శాతంతో అత్యధికంగా అమ్మకాలు తగ్గిపోయాయి.
పాదరక్షల అమ్మకాలు 86 శాతం దెబ్బతిన్నాయి. ‘ప్రస్తుత నెలలో క్రమంగా అన్‌లాక్ విధానం అమలవుతున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహించగలుగుతున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికి రిటైల్ పరిశ్రమకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కీలక మద్దతు అవసరమని’ రాయ్ సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు. కరోనా మహమ్మారి పరిణామాలతో రిటైల్ వ్యాపారులు వేతనాలు, అద్దెలు, విద్యుత్ బిల్లులు, వివిధ పన్నులు, లైసెన్స్ ఫీజుల వంటి అంశాల్లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆ భారాన్ని తగ్గించేందుకు వాటాదారుల నుంచి సహకారం అవసరమని రాయ్ వెల్లడించింది.