- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం!
దిశ, వెబ్‌డెస్క్: ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఏడాది నవంబర్‌లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) స్వల్పంగా 4.91 శాతానికి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. కూరగాయల ధరలు భారీగా పెరిగిపోవడంతో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో పెరిగింది. అంతకుముందు అక్టోబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 4.48 శాతం, గతేడాది నవంబర్‌లో 6.93 శాతంగా నమోదైంది.
జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించిన దాని ప్రకారం.. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 1.87 శాతం నమోదవగా, అక్టోబర్‌లో ఇది 0.85 శాతంగా ఉంది. విభాగాల వారీగా, వంట నూనె ధరలు 29.67 శాతం, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 13.35 శాతం, రవాణా, కమ్యూనికేషన్ 10.02 శాతంగా నమోదైంది. సేవలు, గృహోపకరణాలు 6.41 శాతం, దుస్తులు విభాగంలో 7.94 శాతంగా ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. వంట నూనె ధరలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 30 శాతం పెరగడం గమనార్హం. రిటైల్ ఇంధన ధరలు 2020తో పోలిస్తే 13.35 శాతం పెరిగింది.