- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగష్టు నెలకు సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో భారీగా దిగొచ్చింది. జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) ప్రకారం.. సమీక్షించిన నెలలో వినియోగదారు ధర సూచిక(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం 5.30 శాతానికి చేరుకుంది. జూలైలో ఇది 5.59 శాతం ఉండగా.. గతేడాది ఇదే నెలలో 6.69 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన లక్ష్యం 4-6 శాతం మధ్య ద్రవ్యోల్బణం ఉండటం ఇది వరుసగా రెండోనెల.
ఈ నెలలో ఆహార ధరలు 3.11 శాతానికి తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగొచ్చినట్టు ఎన్ఎస్ఓ గణాంకాలు తెలిపాయి. జూలైలో ఆహార ద్రవ్యోల్బణం 3.96 శాతంగా నమోదైంది. ఆగష్టులో గ్రామీణ ద్రవ్యోల్బణం 5.28 శాతం ఉండగా.. పట్టణ ద్రవ్యోల్బణం 5.32 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 11.68 శాతం క్షీణించాయి. తృణధాన్యాలు 1.42 శాతం తగ్గాయి. చక్కెర, మిఠాయి ధరలు 0.60 శాతం తగ్గాయి. నూనెలు ధరలు 33 శాతం, గుడ్ల ధరలు 16.33 శాతం, మాంసం, చేపల ధరలు 9.19 శాతం పెరిగాయి. పప్పు ధాన్యాల ధరలు 8.81 శాతం, పండ్లు 6.69 శాతం, ఇంధనం 12.95 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షలు 6.84 శాతం పెరిగాయి.