గుడ్‌న్యూస్: నేటి నుంచి పాస్‌పోస్టు సేవలు పునరుద్ధరణ

by Shyam |
Passport
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఆఫీసులతో పాటు తెలంగాణలో పాస్‌పోస్టు ఆఫీసులు మూసివేశారు. తాజాగా.. జూన్ 1st నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోస్టు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోస్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనతో తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట్, టోలిచౌకితో పాటు నిజామాబాద్‌, కరీంనగర్, సికింద్రాబాద్ పాస్‌పోస్ట్ సేవా కేంద్రాల్లో పబ్లిక్ విచారణ కౌంటర్లు, బ్రాంచ్ సెక్రెటరీ కార్యాలయ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అంతేగాకుండా ఆఫీస్ టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం సడలించారు.

Advertisement

Next Story

Most Viewed