- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ .. ప్రారంభమైన బోట్
దిశ, నర్సంపేట : నియోజక వర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరే దిశగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ‘అభివృద్ధికి నోచుకోని మాదన్న పేట చెరువు’ కథనానికి అధికారులు స్పందించారు. మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు వైపుగా అడుగులు పడుతున్నాయి. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే మాదన్నపేట పర్యాటకులతో కిటకిటలాడనుంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం బోటుని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందులో షికారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా నేడు బోటుని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు ఆలస్యమైందని, ఇక కాలయాపన చేయకుండా త్వరితగతిన చర్యలు చేపడతామన్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం : డ్రైవర్ మధు
మాదన్నపేట చెరువులో డీలక్స్ బోటు ఏర్పాటు చేశారు. ఇది 25 సీటింగ్ సామర్ధ్యం కలిగింది. ఒక ట్రిప్‌కి 15 నిముషాలు పడుతుంది. చెరువు నలుమూలలా ఆహ్లదకర వాతావరణంలో చుట్టి వస్తుంది. బోటింగ్ టికెట్ల రేట్లు పెద్దలకు రూ.50, చిన్నపిల్లలకు రూ.30గా నిర్ణయించారు. ప్రయాణీకులకు లైఫ్ జాకెట్స్ సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.