- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కంది పరిశోధనా కేంద్రం'
దిశ, రంగారెడ్డి: రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధర లభించేంతవరకు నిలువ ఉంచేవిదంగా చేయడానికి ప్రతి మండలంలో కనీసం ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలసి.. బీటీ రోడ్డు శంకుస్థాపన, రైతు బజార్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు లాభాలు రావాలనే ఉద్దేశ్యంతో ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి సరిపడా కూరగాయలను రంగారెడ్డి జిల్లా రైతులు పండించాలన్నారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని తీసుకు రావడానికి కేబినెట్ మీటింగ్ లో చర్చించామన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కంది పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏంతో ముందంజలో ఉందన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. రైతులకు అనుకూలమైన పంటలు వేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కొవిడ్-19 నివారణకు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గీత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.