కార్మికుని కోసం ముమ్మర గాలింపు

by Sridhar Babu |   ( Updated:2020-04-07 22:51:50.0  )
కార్మికుని కోసం ముమ్మర గాలింపు
X

దిశ, కరీంనగర్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11 ఇంక్లైన్ బొగ్గుబావిలో అదృశ్యమైన సంజీవ్ అనే కార్మికుని ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ మంగళవారం ఒక్కటో డిప్ వద్ద పంపులను రన్ చేయడానికి వెళ్లి పైకి రాలేదు. రాత్రంతా గని లోపల కార్మికుల సాయం తో సింగరేణి అధికారులు గాలించినా ఆచూకి దొరకలేదు. సింగరేణి అధికారులు రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపారు. గని లోపల పూర్తిస్థాయిలో గాలించేందుకు చర్యల్ని ముమ్మరం చేశారు.

Tags: peddapalli, coal Workers, Missing, last night

Advertisement

Next Story

Most Viewed