8 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

by Shamantha N |
8 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
X

బీజింగ్: చైనాలోని జింజియాంగ్ అటానమస్ రీజియన్‌లోని ఓ గనిలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ ఆదివారం కాపాడి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింది. మరో 21 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు చైనా మీడియా సంస్థ ఒకటి తెలిపింది.
కాగా శనివారం సాయంత్రం హుత్‌బీ కౌంటీలోని ఓ గనిలో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో 29 మంది గనిలో చిక్కుకుపోయినట్టు చైనా మీడియా సంస్థ తెలిపింది.

Advertisement

Next Story