క్రీడా పోటీలకు అనుమతి ఇవ్వాలని వినతి

by Shyam |
క్రీడా పోటీలకు అనుమతి ఇవ్వాలని వినతి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో డిసెంబర్‎లో నిర్వహించే క్రీడా పోటీలకు అనుమతి ఇవ్వాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేని మంత్రి శ్రీనివాస్ గౌడ్‎ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కే.దేవేందర్, కోశాధికారి జె.బాలరాజ్, ఉపాధ్యక్షుడు ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్,టి.వెంకటేష్, మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా డిసెంబర్ నెలలో 9, 10 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అతి త్వరలో ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed