‘అందులో పోలీస్ శాఖ ముందు ఉంటుంది’

by Shyam |
‘అందులో పోలీస్ శాఖ ముందు ఉంటుంది’
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్‌లోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ డీజీపీ బి.బాలనాగాదేవి, రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ కవిత, హైదరాబాద్ కమిషనరేట్‌లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ నరేందర్ సింగ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. గౌరవవందనం స్వీకరించి, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అడిషనల్ డీజీపీ బి.బాలనాగాదేవి మాట్లాడుతూ… దేశ పౌరులకు రాజ్యాంగపరమైన హక్కులకు అందించేందుకు కృషి చేసేవారిలో పోలీస్ శాఖ మొదట ఉంటుందని తెలిపారు. సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… అనేక మంది వ్యక్తుల త్యాగాల ఫలితంగానే ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు.

Advertisement

Next Story