మితిమీరిన ‘నమస్తే’ విలేకరి ఆగడాలు : సర్పంచ్‌ల ఫోరం

by Shyam |
మితిమీరిన ‘నమస్తే’ విలేకరి ఆగడాలు : సర్పంచ్‌ల ఫోరం
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో ‘నమస్తే తెలంగాణ దిన పత్రిక’లో పని చేస్తున్న విలేకరి బెదిరింపులకు పాల్పడుతున్నారని, వెంటనే అతడిని విధుల్లోంచి తొలగించాలని ఆదివారం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పోలెబోయిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో 29 గ్రామాలు ఉన్నాయని, 23 మంది టీఆర్‌ఎస్ సర్పంచులు, 2 కాంగ్రెస్ సర్పంచ్‌‌లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేపడుతున్న ‘నమస్తే తెలంగాణ విలేకరి సతీశ్’ పనుల్లో నాణ్యత లేదని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు.

టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు దేనికీ పనికిరారు అని కించపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామ పంచాయితీ నుండి రూ.15వేలు ఇవ్వాలని లేనట్లయితే తమ గురించి పత్రికలో రాస్తానని వేధిస్తున్నట్లు వాపోయారు. వెంటనే అతడిని పత్రిక నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సర్పంచులు నమస్తే తెలంగాణ దిన పత్రికపై సమావేశం పెట్టడంతో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed