పెట్రోల్ బంకుల్లో ‘మోడీ’ హోర్డింగ్‌లు తొలగించండి: ఈసీ

by Anukaran |
పెట్రోల్ బంకుల్లో ‘మోడీ’ హోర్డింగ్‌లు తొలగించండి: ఈసీ
X

దిశ, న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సోం, పుదుచ్చేరీలలో రాజకీయ వేడి మొదలైంది. అయితే ఈ 5 అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే గత నెల 27 న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్ 19 వ్యాక్సినేషన్‌ ఫొటోలు, వీడియోలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నదని టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

దీంతో ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రాలతో ఉన్న హోర్డింగ్‌లను మూడు రోజుల్లో(72 గంటలు)గా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఆ హోర్డింగ్‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని ఈసీ పేర్కొంది.

Advertisement

Next Story