- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దుమారం రేపుతున్న కేశినేని వ్యవహారం.. చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు
X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష టీడీపీలో ఆయన తీరు కలకలం రేపుతోంది. తాజాగా విజయవాడ బస్టాండ్ సమీపంలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించడం దుమారం రేపుతోంది. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు.
చంద్రబాబు, ఇతర నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫోటోలు దర్శనమిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే కేశినేని నాని పార్టీ అధిష్టానానికి సమాచారం అందించారు. ఇలాంటి తరుణంలో ఫ్లెక్సీలను తొలగించడం కొత్త చర్చకు దారితీసింది. కేశినేని పార్టీ మారే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అనే అంశం తెరపైకి వచ్చింది.
Advertisement
Next Story