- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్ జిల్లాలో 4 కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేత
దిశ, హైదరాబాద్: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో (నాన్ జీహెచ్ఎంసీ) 4 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తున్నట్టు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కన్పించకపోవడంతో, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సంబంధించి మరెవ్వరికీ కొత్తగా కరోనా లక్షణాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ, పాజిటివ్ కేసులు వచ్చిన కుటుంబాల వారు క్వారంటైన్ నిబంధనలను పాటించాలని, విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించడం వల్ల మేడ్చల్ గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో కరోనా నియంత్రణను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న వైద్య, ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. కరోనా నియంత్రణకు పూర్తి సహకారం అందిస్తోన్న ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, సూచనల మేరకు జిల్లాలో 3600 పరిశ్రమలలో అత్యధిక శాతం పనులు ఇప్పటికే ప్రారంభం అయినందున వలస కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత వరకూ ఇక్కడే ఉండి తమ పనులు చూసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
Tags: Corona Effect, Medchal Collector Vasam Venkateshwar, Containment Zones, Lockdown, Industrial Running