యంగ్ కపుల్స్‌లో పెరుగుతున్న ‘రిమోట్ కొహబిటేషన్’

by Sujitha Rachapalli |
video-kohabitation
X

దిశ, ఫీచర్స్ : జపాన్‌లో గత కొన్ని రోజుల నుంచి ‘రిమోట్ కొహబిటేషన్’ చర్చనీయాంశంగా మారింది. విడివిడిగా జీవిస్తూ, ఫ్రీ వీడియో కాల్స్ ద్వారా సన్నిహితంగా ఉండేందుకు యువజంటలు ఇష్టపడుతున్నారు. జపనీస్ యంగ్ కపుల్స్‌లో ఈ ధోరణి పెరుగుతోన్నట్లు కథనాలు వస్తున్నాయి.

యువ జపనీస్ జంటలు ఇష్టపూర్వకంగా లేదా కొంతకాలం విడివిడిగా జీవించాలనే ఉద్దేశంతో ‘రిమోట్ కొహబిటేషన్’ ధోరణిని ఫాలో అవుతున్నారని జపాన్ న్యూస్ చానల్ ఇటీవలే వెల్లడించింది. ఇందులో భాగంగా వాళ్లు ‘వీడియో యాప్స్’ ద్వారా కనెక్ట్ అవుతారు. గంటలకొద్దీ మాట్లాడుకుంటారు. రాత్రి కూడా ఈ సంభాషణ కొనసాగిస్తూనే నిద్రిస్తారు. రాత్రంతా వీడియో కాల్ ఆన్‌లోనే ఉంటుంది. ఉదయాన్నే లేచి ఒకరికొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకున్న తర్వాత దాన్ని టర్న్ ఆఫ్ చేస్తున్నారు. రిమోట్ కొహబిటేషన్‌‌లో ‘కాన్‌స్టంట్ కన్వర్జేషన్’ అవసరం లేదు.

ఇద్దరు భాగస్వాములు తమ తమ షెడ్యూల్‌ కొనసాగిస్తూనే, ఆ సమయంలో యాప్ ఆన్ చేయడం వల్ల వాళ్లిద్దరూ ఒక్కటిగా కలుసున్నారనే ఫీలింగ్ అనుభవిస్తారు. తమ భాగస్వామి చేస్తున్న యాక్టివిటీని కూడా వారికి సంతోషాన్ని పంచుతుంది. ఉదాహరణకు హెయిర్ డ్రైయర్ శబ్దాలను వినడం, వంట చేయడం లేదా టీవీ చూడటం వంటి పనులు జంటలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇక ‘రిమోట్ కొహబిటేషన్’ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ‘ఇండిపెండెన్స్’. ఇద్దరూ తమకు నచ్చిన పనిచేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఒత్తిడి అసలే ఉండదు. ఒకరి పనులను మరొకరు గౌరవిస్తూ, ఏకాంతాన్ని ఆస్వాదిస్తూనే, ఆన్‌లైన్ కపుల్స్‌గానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వర్చువల్‌గా కలిసి సినిమాలు చూడటం, విందారాగించడం వంటివి చేస్తున్నారు.

‘రిమోట్ కొహబిటేషన్’ జపనీస్ సంస్కృతికి భిన్నంగా ఉన్నా కొవిడ్-19 మహమ్మారి వల్ల పాపులారిటీ పెరిగింది. కరోనా సమయంలో ‘డిస్టెన్స్ కపుల్స్’ను అనుసంధానించడానికి రిమోట్ కొహబిటేషన్ స్వాగతించే మార్గంగా అనిపించినప్పటికీ, ఇది సాధారణ ప్రజలు, రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ నుంచి ప్రతికూల అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed