మూవీ మొఘల్‌కు నివాళి..

by Shyam |
మూవీ మొఘల్‌కు నివాళి..
X

‘రాజా.. అనే పిలుపులో మీ ఆత్మీయత మరిచిపోలేను..’ అంటూ మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి. రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పదన్న చిరు.. రాజా..! అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూశానని అన్నారు. ‘కారంచేడు నుంచి వచ్చిన ఓ కుర్రాడు.. దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు.. నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణమని’ అన్నారు. సినిమా అంటే మీకున్న ప్రేమ, మీరు చేసిన సేవలు ఈ తరానికి ఆదర్శమని కొనియాడారు.

https://twitter.com/KChiruTweets/status/1269209051209928704?s=20

నువ్వే నా బలం నాన్న..

‘మా హృదయాల్లో మీరెప్పటికీ ఉంటారు నాన్న గారు అంటూ..’ విక్టరీ వెంకటేశ్ తన తండ్రి రామానాయుడును స్మరించుకున్నారు. నువ్వే నా బలమన్న వెంకీ.. నిన్ను ఇప్పుడు, ఎప్పుడూ మిస్ అవుతున్నట్లు తెలిపారు. నీతో ఇన్ని మధురజ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న.. నీ ఉనికిని ఎప్పుడూ కోల్పోతూనే ఉన్నానని ఉద్వేగానికి లోనయ్యారు.

https://twitter.com/VenkyMama/status/1268884765379194880?s=20

రూపాయి మీద ఉన్న అన్ని భాషల్లోనూ నిర్మాణం

అందరు నిర్మాతలు రూపాయి కోసం సినిమా తీసేవారయితే.. తాను రూపాయి కోసమే కాదు దాని మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమా తీయగలిగిన ఏకైక నిర్మాత అని కీర్తించారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. ‘మా మంచి మూవీ మొఘల్ రామానాయుడు గారి జయంతి’ అని ఆయనకు నివాళులు అర్పించిన కేఆర్.. దేవత సినిమాతోనే సురేష్ ప్రొడక్షన్స్‌తో తన దర్శకత్వ అనుబంధం మొదలైందని.. ఆ తర్వాత ఎన్నో మధుర జ్ఞాపకాలు చేరాయని తెలిపారు.

https://twitter.com/Ragavendraraoba/status/1269231559443243008?s=20

Advertisement

Next Story