‘అబోటాబాద్‌’ను గుర్తు తెచ్చుకోండి -భారత్

by Anukaran |
‘అబోటాబాద్‌’ను గుర్తు తెచ్చుకోండి -భారత్
X

న్యూయార్క్: పాకిస్తాన్ అబద్ధాలపై అబోటాబాద్ వ్యవహారాన్ని భారత్ గుర్తుచేసింది. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తూ ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు పాకిస్తాన్ అందించిన నివేదికపై ఈ విధంగా స్పందించింది. పాకిస్తాన్ చెప్పే అబద్ధాలు కొత్తేమీ కాదని, ఆ దేశ నివేదికలపై ప్రపంచదేశాలకున్న విశ్వసనీయత ఆవగింజంత అని భారత దౌత్యాధికారి టీఎస్ తిరుమూర్తి విమర్శించారు. ఐరాస ప్రకటించిన ఉగ్రవాదుల్లో అత్యధికులకు ఆశ్రయంగానున్న పాకిస్తాన్ కట్టుకథలకు ప్రతీతి అని ఆరోపించారు. అబోటాబాద్‌ను గుర్తుకు తెచ్చుకోండని ట్వీట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయంగా భావించే అబోటాబాద్ నగరంలో అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొన్నేళ్లుగా తలదాచుకున్నాడు. చివరికి 2011 మే 2న అమెరికా బలగాలు లాడెన్‌ను అబోటాబాద్‌లో హతమార్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed