విజయవాడ ఘటనపై రిపోర్ట్.. రమేష్ ఆస్పత్రిదే..

by Anukaran |
విజయవాడ ఘటనపై రిపోర్ట్.. రమేష్ ఆస్పత్రిదే..
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అగ్నిప్రమాదం ఘటనపై నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును ప్రభుత్వం విడుదల చేసింది. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నది. కొవిడ్ చికిత్స అందజేయడానికి స్వర్ణప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి తీసుకున్నదని, ఈ విషయమై రెండు యాజమాన్యాలు ఎంఎస్ వోయూ కుదుర్చుకున్నాయని పేర్కొన్నది.

స్వర్ణప్యాలెస్ లో విద్యుత్ లోపాలున్నాయని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం గమనించింది.. కానీ, వాటిని సరిచేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పట్టించుకోకుండా కొవిడ్ కేర్ సెంటర్ తెరిచిందని, విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రిపోర్టులో వెల్లడించింది. లోపాలున్న కొవిడ్ సెంటర్ ను నడిపినందుకు రమేష్ ఆస్పత్రిదే బాధ్యత అని, కొవిడ్ సెంటర్ నిర్వహించడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని, నిందితులు బయటకు వస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశముందని రిమాండ్ రిపోర్టు పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed