- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు అండగా రిలయన్స్.. ఆ ఖర్చును తామే భరిస్తామని ప్రకటన!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) దేశంలోని తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఖర్చును భరించనున్నట్టు ప్రకటించింది. రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయాన్ని తమ ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సిబ్బంది ముందుకు రావాలని, రిలయెన్స్ ఉద్యోగులు, వారి భార్యా పిల్లలు, తల్లిదండ్రులు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ‘ మీరో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించడానికి అయ్యే ఖర్చును రిలయన్స్ సంస్థ భరిస్తుంది. మీ భద్రత, శ్రేయస్సు మా బాధ్యత.
త్వరలో మీ అందరి సహకారంతో కరోనా మహమ్మారిని తరిమికొడతం. అప్పటివరకు జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్యం వహించకండి. పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని’ నీతా అంబానీ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో చెప్పారు. రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ఇదివరకే తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కరోనా టీకా అందుబాటులోకి రాగానే అందిస్తామని వెల్లడించారు. కాగా, రిలయన్స్ కాకుండా ఇప్పటికే ఐటీ దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, యాక్సెంచర్, క్యాప్‌జెమిని, విప్రో తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చాయి.