- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్చూన్-500 జాబితాలో వెనకబడిన రిలయన్స్ ఇండస్ట్రీస్!
దిశ, వెబ్‌డెస్క్: ఫార్చూన్ గ్లోబల్ 500 సంస్థల ర్యాంకింగ్స్ జాబితాలో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వెనకబడింది. ఆదాయం క్షీణించడంతో రిలయన్స్ సంస్థ 155 స్థానానికి పరిమితమైనట్టు సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2017 తర్వాత రిలయన్స్ సంస్థకు ఇదే అతి తక్కువ ర్యాంకింగ్ కావడం గమనార్హం. గతేడాది రెండో త్రైమాసికంలో ఇంధన ధరలు భారీగా తగ్గడంతో రిలయన్స్ సంస్థ ఆదాయం 25.3 శాతం దిగజారి 4.68 లక్షల కోట్లుగా నమోదైంది. దీనివల్లే సంస్థ ర్యాంకింగ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీల ర్యాంకింగ్‌లు కూడా దిగజారాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఏకంగా 61 స్థానాలు క్షీణించి 212 స్థానానికి చేరుకుంది. ఓఎన్‌జీసీ 53 స్థానాలు పడిపోయి 243వ ర్యాంకుతో సరిపెట్టింది.
ఇక, దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన ర్యాంకును 16 స్థానాలు మెరుగుపరుచుకుని 205వ స్థానంలో నిలిచింది. మరో సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 144 స్థానాలు మెరుగుపడి 348 వద్ద నిలిచింది. టాటా మోటార్స్ 20 స్థానాలు పడిపోయి 357వ స్థానంలో ఉంది. బీపీసీఎల్ 394వ ర్యాంకును సాధించింది. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో వాల్‌మార్ట్ సంస్థ నిలవగా, తర్వాతి స్థానంలో చైనా స్టేట్ గ్రిడ్ సంస్థ ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టెక్ దిగ్గజం యాపిల్ ఆరో స్థానంలో ఉండగా, అత్యధిక లాభాలను సాధించిన సంస్థగా అగ్రస్థానంలో నిలించింది. కాగా, ఫార్చున్ సంస్థ ఈ ర్యాంకింగ్‌లను ప్రస్తుత ఏడాది మార్చి 31 నాటికి సంస్థల వార్షిక ఆదాయాలను బట్టి ర్యాంకింగ్‌లను ఇచ్చింది.