5జీ సేవలందించే ప్రయత్నాల్లో రిలయన్స్ జియో!

by Harish |
5జీ సేవలందించే ప్రయత్నాల్లో రిలయన్స్ జియో!
X

దిశ, సెంట్రల్ డెస్క్: టెలికాం రంగంలో సంచలనాలతో మొదలై అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియోను 5జీ నెట్‌వర్క్‌లోనూ అగ్రగామిగా నిలిపేందుకు అధినేత ముఖేశ్ అంబానీ సిద్ధమవుతున్నారు. జియో ప్రారంభమైన కొత్తలో దేశంలో వేగంగా 4జీని విస్తరింపజేయడంలో జియో కీలకపాత్ర పోషించింది. ఉచిత కాల్స్, చౌకైన డేటాలతో దూసుకొచ్చిన జియో 5జీ నెట్‌వర్క్ సేవలను కూడా అందించాలని యోచిస్తోంది. ఇటీవల వార్షిక నివేకలో 5జీ నెట్‌వర్క్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి స్పెక్ట్రం వేలానికి సిద్ధమవుతున్న వేళ జియో 5జీ నెట్‌వర్క్, ఫైబర్ అసెట్స్ ఎక్స్‌టెన్షన్ అంశాల్లో కీలక పాత్ర పోషించేందుకు చూస్తోందని పేర్కొంది. ఇదివరకే 5జీ సేవలను పరీక్షించేందుకు జియో ప్రభుత్వ అనుమతిని కోరిందని సమాచారం. టెలికాం ఎక్విప్‌మెంట్ కంపెనీలతో టెలికాం కంపెనీలు 5జీ సేవల పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, రిలయన్స్ జియో కూడా సొంతంగా 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందనే నివేదికలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed