- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియో.. నాలుగో అతిపెద్ద కంపెనీ!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియోలో పలు అమెరికన్ కంపెనీల భారీ పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద నాలుగవ కంపెనీగా అవతరించింది. శుక్రవారం అమెరికా ఈక్విటీ ఫండ్ పార్టనర్స్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్‌లో రూ. 11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటా కొనుగోలుతో జియో రికార్డ్ సృష్టించింది. రిలయన్స్ జియో మార్కెట్ క్యాపిటలజేషన్ మూడు వారాల వ్యవధిలో మూడు భారీ ఒప్పందాలతో కంపెనీల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లు కాగా, జియో ఎంటర్‌ప్రైజెస్ విలువ రూ. 5.16 లక్షల కోట్లు. దీంతో జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడోస్థానంలో ఉన్నాయి. రిలయన్స్ జియోలో విస్తా ఈక్విటీ పార్టనర్స్ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫాం ఈ ఘనతను సాధించగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ జియోలో మూడు వారాల వ్యవధిలోనే మొత్తం రూ. 60,596 కోట్లు పెట్టుబడులు రావడం గమనార్హం.
Tags: reliance jio, RIL, jio market cap, reliance industries