రిలయన్స్ లీఫ్ సైన్సెస్ నుంచి కొవిడ్‌ను గుర్తించే ఆర్‌టీ-పీసీఆర్ కిట్!

by Harish |   ( Updated:2020-11-16 05:51:26.0  )
రిలయన్స్ లీఫ్ సైన్సెస్ నుంచి కొవిడ్‌ను గుర్తించే ఆర్‌టీ-పీసీఆర్ కిట్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ అనుబంధ కంపెనీ రిలయన్స్ లైఫ్ సైన్సెస్, ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఈ కిట్ ద్వారా కేవలం 2 గంటల్లోగా కరోనా వైరస్ ఫలితాలను నిర్ధారిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19ని అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న విధానం ఈ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష. ఈ విధానం ద్వారా ఫలితాలను పొందేందుకు 24 గంటల సమయం పడుతుంది. అయితే, ఇటీవల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది 15-30 నిమిషాల్లోగా ఫలితాలను అందిస్తోంది. కానీ, ఈ విధానంలో కొన్ని లోపాలున్నప్పటికీ, ఎక్కువగా ఈ విధానాన్నే ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌కు ఆర్-గ్రీన్ కిట్‌గా కంపెనీ పేరు పెట్టింది. ఈ పరికరం నాణ్యత, పనితీరుకు సంబంధించి విశ్లేషణకు ఐసీఎంఆర్‌కు పంపించగా, దానికి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాని, ఈ పరికరం వినియోగానికి సంబంధించి ధృవీకరణ పత్రాన్ని ఇంకా ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed