ఈ విషయమై కేసీఆర్‌ను కలిస్తే పనైపోయింది

by  |
ఈ విషయమై కేసీఆర్‌ను కలిస్తే పనైపోయింది
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు భూములకు సరిపడు సాగు నీటిని పాలేరు రిజర్వాయర్‌ నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయం నిండిన వెంటనే నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయాలని, ఇప్పటికే 225 టీఎంసీల నీటి నిల్వ సాగర్‌ జలాశయంలో ఉన్నందున ఖమ్మం జిల్లాకు సాగునీటిని ఇవ్వాలని మంత్రి పువ్వాడ ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన విషయం విధితమే. ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611 టీఎంసీలు కేటాయించారని, వార బందీ విధానంలో కాలువలకు నీటిని విడుదల చేసి, ఆయకట్టు చివరి భూములకు సైతం నీటిని అందించాలని మొన్న జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, రైతు బంధు జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర రావు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


Next Story

Most Viewed