వెబ్‌ వరల్డ్‌లో అడుగుపెట్టనున్న రెజీనా..

by Shyam |   ( Updated:2021-05-13 05:12:40.0  )
వెబ్‌ వరల్డ్‌లో అడుగుపెట్టనున్న రెజీనా..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ రెజీనా కాసాండ్రా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. భౌతిక శాస్త్రవేత్తలు హోమీ బాబా, విక్రమ్ సారాభాయి, ఏపీజే అబ్దుల్ కలామ్ న్యూక్లియర్ ఫిజిక్స్, స్పేస్ సైన్స్‌లో అందించిన సేవలపై తెరకెక్కుతున్న సిరీస్ ‘రాకెట్ బాయ్స్’లో కీలకపాత్రలో కనిపించనుంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్, ఎమ్మీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇష్వాక్ సింగ్ విక్రమ్ సారాభాయిగా కనిపించనుండగా.. జిమ్ సర్భ్ హోమీ జహంగీర్ భాభాగా నటించనున్నారు. కాగా టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్నా సరే రెజీనాకు సరైన అవకాశాలు మాత్రం దొరకడం లేదు. కానీ ఈ వెబ్ సిరీస్‌తో తన కెరియర్ బిజీ అయిపోతుందని చెబుతున్నారు మేకర్స్.

Advertisement

Next Story