భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉచిత కంటి ఆపరేషన్ : ఎమ్మెల్యే ‘రేగా’ పిలుపు

by Sridhar Babu |   ( Updated:2021-11-24 06:45:46.0  )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉచిత కంటి ఆపరేషన్ : ఎమ్మెల్యే ‘రేగా’ పిలుపు
X

దిశ, మణుగూరు : – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని 100 పడకల ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించబడుతోంది. దీనిని రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా డిసెంబర్ 5 వ తేదీన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ప్రారంభం కానుంది.

బుధవారం ఎమ్మెల్యే కాంతారావు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఉచిత కంటి ఆపరేషన్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సుమారు 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్ చేయబడునని పేర్కొన్నారు.

Advertisement

Next Story