- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఈ-వేస్ట్‌తో 30 అడుగుల రోబో.. ఎక్కడో తెలుసా.?
దిశ, ఫీచర్స్ : రోజుకు వందలాది కొత్త పరికరాలు మార్కెట్‌లో రిలీజ్ అవుతుండగా, పాత వస్తువులు అంతకుమించిన స్థాయిలో మూలనపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం పెరిగే కొద్దీ వ్యర్థాలు సైతం అంతకంతకూ పోగవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే ప్లాస్టిక్‌కు మించిన ఉపద్రవం వస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ-వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ విషయంలో విదేశాలు చొరవ చూపుతుంటే, ఈ తరహా ప్రయత్నాల్లో ఇండియా వెనకబడటం గమనార్హం. అయితే పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు మాత్రం తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా, బెహ్రంపూర్‌లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు e-వ్యర్థాలతో రోబోను రూపొందించి ‘ఈ-వేస్ట్’ నిర్వహణకు కొత్త నిర్వచనమిచ్చారు.
బెహ్రంపూర్ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, పెయింటర్ డిపార్ట్‌మెంట్ ట్రైనీలు నగరమంతటా తిరిగి ఎలక్ట్రానిక్ బొమ్మలు, పీసీబీ, ప్రింటర్లు, సీడీ ప్లేయర్స్, విసీఆర్‌లు, కాట్రిడ్జ్‌లు, ర్యామ్, కీబోర్డులు, మౌజ్, రిఫ్రిజరేటర్, ఏసీ, కూలర్ విడిభాగాలు మొదలైన వాటిని సేకరించారు. అలా పోగుచేసిన ఈ-వ్యర్థాలతో 30 అడుగుల ఎత్తు, 3 టన్నుల బరువుతో ఈ-వేస్ట్ శిల్పాన్ని రూపొందించారు.
దేశం పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది గాలితో పాటు నీటిని మరింత కలుషితం చేస్తుంది. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులకు తిరిగి మరమ్మతులు చేస్తే పునరుద్ధరించిన వస్తువులుగా విక్రయించవచ్చు. కానీ చాలా వస్తువులు ఈ-వేస్ట్‌గా మారతాయి. హానికరమైన భాగాలను కలిగి ఉన్నందున వాటిని డంప్‌యార్డ్ వద్ద కూడా పారవేయలేం. కాపర్, లిక్విడ్ క్రిస్టల్, లిథియం, పాదరసం, నికెల్, సెలీనియం, ఆర్సెనిక్, బేరియం సహా అనేక విషపూరిత మూలకాలను కలిగిఉండి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ప్రతీ ఒక్కరూ ప్రకృతితో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ‘రోబో ప్రాజెక్ట్’ ప్రారంభించాం. 2020లో ITI బెహ్రంపూర్ ఓపెన్-ఎయిర్ స్క్రాప్ స్కల్ప్‌చర్ పార్క్‌ను రూపొందించగా.. ఆసియాలోనే అతిపెద్ద ఈ వేస్ట్ శిల్పకళా పార్కుగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.10,000 చదరపు మీటర్లలో విస్తీర్ణం గల ఈ పార్కులో 7 నుంచి 70 అడుగుల ఎత్తు వరకు 20 శిల్పాలు కొలువుతీరాయి. ప్రస్తుత రోబో మరో అదనపు ఆకర్షణ కాగా, ఇది ఇండియాలోనే ఎత్తయిన ఈ-వేస్ట్ శిల్పంగా నిలవనుంది.
– డాక్టర్ రజత్ కుమార్ పాణిగ్రాహి, ప్రిన్సిపల్, ITI బెహ్రంపూర్