- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. నియామకాల తేదీ ఖరారు..
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో 2018 డీఎస్సీలో భర్తీకాని ఖాళీల నియామకాలకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 20న ప్రొవిజినల్ జాబితా వెల్లడించనున్నారు. డిసెంబర్ 22న రాష్ట్ర ఐటీ సెల్ నుంచి అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు. 23, 24 తేదీల్లో ధ్రువపత్రాల అప్‌లోడ్, డిసెంబర్ 24-28 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. డిసెంబర్ 29న పోస్టుల ఖాళీలను వెల్లడించనున్నారు. డిసెంబర్ 30,31న కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఇకపోతే కోర్టు కేసులు, వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ తేదీలు ఇవే
డిసెంబర్ 20 – ప్రొవిజినల్ జాబితా వెల్లడి
డిసెంబర్ 21 – తుది జాబితా ఖరారు
డిసెంబర్ 22 – ఎస్ఎంఎస్ సమాచారం
డిసెంబర్23, 24 – ధ్రువపత్రాల అప్‌లోడ్
డిసెంబర్ 24-28 – ధ్రువపత్రాల పరిశీలన
డిసెంబర్ 29 – ఖాళీల ప్రదర్శన
డిసెంబర్ 30,31 – కౌన్సిలింగ్, నియామక ఉత్తర్వులు
- Tags
- dsc