ఏపీలో మళ్లీ రికార్డు స్థాయి కరోనా కేసులు..

by srinivas |
ఏపీలో మళ్లీ రికార్డు స్థాయి కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,096 కేసులు నమోదవ్వగా, 20 మంది మృతి చెందారు. మరణించిన వారిలో చిత్తూరు-5, కృష్ణాలో-3, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో శుక్రవారం 1024 కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9.48 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 35,592 యాక్టివ్ కేసులున్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9.05 లక్షలకు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 7,373 చేరింది.

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్ టెస్టులకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఆస్పత్రుల్లో శానిటేషన్, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed