- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపఎన్నికపై రేవంత్ సమీక్ష.. ఆ ఇద్దరు ముఖ్యనేతల డుమ్మా రహస్యమిదే!
దిశ ప్రతినిధి, కరీంనగర్: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డిని చీఫ్ గా ప్రకటించడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా లేక మరేదైనా కారణం ఉందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల సమీక్షా సమావేశానికి కూడా వీరిద్దరూ డుమ్మా కొట్టడంతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ లోని ఇందిరాభవన్ లో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం బుధవారం జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ లు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన బాధ్యులు కూడా అటెండ్ అయ్యారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ లుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు హాజరు కాకపోవడం గమనార్హం.
హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో పార్టీ అవలంభించాల్సిన వ్యూహంపై జరుగుతున్న సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడంపై కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కలిసి వెళ్లి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి దూరంగానే ఉన్నారు.
దీంతో ఈ ఇద్దరు నాయకులు జీవన్ రెడ్డిని మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని కొంతకాలం తనను ఇబ్బంది పెట్టవద్దని జీవన్ రెడ్డి సుతిమెత్తగా వారికి చెప్పి పంపించినట్టు సమాచారం. బుధవారం గోదావరిఖని పర్యటనకు వెళ్లిన జీవన్ రెడ్డి అటు నుండి అటు హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఈ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. కాగా ఆయన గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో బ్యాక్ పెయిన్ కి సంబంధించిన చికిత్స చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజూ థెరఫీ కోసం ఆసుపత్రికి వెళ్తున్నందున శ్రీధర్ బాబు కో ఆర్డినేషన్ మీటింగ్ కు హాజరు కాలేదని సమాచారం.