- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డి డీసీసీబీ పీఠంపై ‘రియల్’ కన్ను
ఏ ఎన్నికలోచ్చిన రియల్ వ్యాపారులే కీలకంగా మారిపోతున్నారు. రాజకీయ పార్టీలు కూడా డబ్బును దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంతో పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు వీరిదే జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల బరిలో రైతుల శ్రేయస్సు కోసం ఆలోచించేవారే ఉంటారు కానీ, రైతాంగంపై అవగాహన లేని వారు బరిలో నిలుస్తుండటంతో రైతుల్లో తీవ్ర మనస్పర్థలను తీసుకువస్తుంది. రియల్ వ్యాపారి మనోహర్ రెడ్డి, మాజీ హోంమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి సోదరుడి కుమారుడు కృష్ణారెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పెంటారెడ్డిలు రేసులో ఉండి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మరొకరు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంకొకరు అందరి ఆశీస్సులు నాకే ఉన్నాయని ప్రచారం చేస్తుండటంతో రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పదవి తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాగానే ఛైర్మన్ ఎంపిక
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 884 డైరెక్టర్ స్ధానాలకు 244 మంది ఏకగ్రీవమయ్యాయి. రంగారెడ్డిలో 37, వికారాబాద్‌లో 22, మేడ్చల్‌లో 9 చొప్పున కలిపి 68 సోసైటీలున్నాయి. ఇందులో ఏకగ్రీవమైన ఇద్దరు డైరెక్టర్లతో పాటు, సొసైటీ ఛైర్మన్లు సైతం డీసీసీబీ ఛైర్మన్ పీఠంపై లుక్కేశారు. డీసీసీబీ ఛైర్మన్ దక్కాలంటే సహకార సంఘం డైరక్టర్‌గా ఎన్నికై చైర్మన్ పదవి దక్కించుకోవాలి. పరిగి నియోజక వర్గంలో కుల్కచర్ల పీఏసీఎస్ ఏకగ్రీవం కాగా.. అలాగే బాలాపూర్ మండలం బండ్లగూడ కాస్ల పీఏసీఎస్ కూడా ఏకగ్రీవమైంది. మిగిలిన 64 సొసైటీల్లో 640 డైరక్టర్ స్థానాలకు పోటీ జరగనుంది. కొత్త జిల్లాల ప్రకారం ప్రభుత్వం డీసీసీబీ, డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేయకపోవడంతో 3 జిల్లాలకు కలిపి ఒకే డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పీఠం ఉంది. దీంతో రెండీంటిలో ఏదో ఒకటి దక్కించుకోవాలని ముగ్గురు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
రియల్ వ్యాపారులే..
కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రియల్ వ్యాపారి బి.మనోహర్ రెడ్డి కుల్కచర్ల పీఏసీఎస్‌లోని 4వ వార్డు నుంచి ఏకగ్రీవమై డీసీసీబీ ఛైర్మన్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 2018లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టికెట్ ఆశించి భంగపడిన ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనే టీఆర్‌ఎస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన డీసీసీబీ ఛైర్మన్ పదవిపై ఎన్నో అశలు పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఎంపీ సంతోష్‌తో కూడా సన్నిహితంగా ఉంటాడు. ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడేందుకు కేటీఆర్‌ను కూడా కలిశారని ప్రచారం జరుగుతోంది.
చేవెళ్ల మండలం తల్లారం గ్రామానికి పటోళ్ల కృష్ణారెడ్డి సైతం డీసీసీబీ పదవిని ఆశిస్తున్నాడు. చేవెళ్ల మండలం ఆలూరు పీఏసీఎస్ ఛైర్మన్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయిన కృష్ణారెడ్డి.. ఈసారి కూడా ఆలూరు సహకారం సంఘం 12వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 9 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నాడు. చైర్మన్ పదవి దక్కేందుకు మద్దతు ఉన్నప్పటికీ అక్కడ మిగిలిన మూడు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దివంగత మాజీ హోంమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి సోదరుడి కుమారుడు కావడంతో మంత్రి సబితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆశిస్సులున్నాయి. తన నియోజకవర్గానికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అధిష్టానాన్ని కోరుతున్నారు. అటు.. బాలాపూర్ మండలానికి చెందిన తాజా మాజీ చైర్మన్ పెంటారెడ్డి సైతం మరోసారి డీసీసీబీ చైర్మన్ ఆశలు పెంచుకోవడంతో పదవి ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మారింది.