- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘థర్డ్ వేవ్’కు సిద్ధంగా ఉన్నాం
ముంబయి : సెకండ్ వేవ్ ధాటికి అల్లాడుతున్న మహారష్ట్ర.. త్వరలోనే థర్డ్ వేవ్‌నూ ఎదుర్కోనుందా..? ఆ రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాక్రే వ్యాఖ్యలు చూస్తే అది నిజమనిపించకమానదు. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ పీక్స్ లో ఉండగానే.. తాము థర్డ్ వేవ్‌కూ సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆదివారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే అది సెకండ్ వేవ్ మాదిరి విజృంభిస్తుందా..? లేక బలహీనంగా మారుతుందా..? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి గాను ఐదు లక్షల బెడ్లను సిద్ధం చేశామని అన్నారు. అందులో 70 శాతం ఆక్సిజన్ సదుపాయాలు కలిగి ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సూచించిన దాని మేరకే తాము ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కరోనాను కట్టడి చేయడానికి వేస్తున్న వ్యాక్సిన్లు తక్షణమే అంతగా ప్రభావం చూపకపోయినా భవిష్యత్తులో మాత్రం అవి ఎంతో ఉపయోగంలోకి వస్తాయని ఆదిత్య థాక్రే తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. మరో 10-15 రోజుల్లో కరోనా రెండో దశ వ్యాప్తి నుంచి ఉపశమనం పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.