ఐపీఎల్‌ నిర్వహణకు రెడీ అవుతున్నాం: ఐపీఎల్ చీఫ్ బ్రిజేష్

by Shyam |
ఐపీఎల్‌ నిర్వహణకు రెడీ అవుతున్నాం: ఐపీఎల్ చీఫ్ బ్రిజేష్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చీఫ్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడినట్లేనని, కొన్ని సాంకేతిక కారణాలతో ఐసీసీ ప్రకటించడం లేదని ఆయన చెప్పారు. ఐసీసీ వాయిదా నిర్ణయం చెప్పగానే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ప్రేక్షకులకు అనుమతి ఉండదని, ఖాళీ స్టేడియాల్లోనే ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే 40శాతం మంది ప్రేక్షకుల అనుమతి విషయం కూడా ఆలోచిస్తామన్నారు. ఐపీఎల్‌ను విదేశాలకు తరలించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story