కేవైసీ అప్‌డేట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్‌బీఐ

by Harish |   ( Updated:2021-09-13 12:14:28.0  )
కేవైసీ అప్‌డేట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సెంట్రల్ బ్యాంక్ RBI బ్యాంకు ఖాతాదారులను హెచ్చరించింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులను కోరింది. బ్యాంకి అకౌంట్ లాగ్ఇన్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం, నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలు, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, పాస్‌వర్డ్, పిన్ నంబర్, ఓటీపీ లాంటి వాటిని ఏజెన్సీలకు గానీ, తెలియని వ్యక్తులకు గాని ఇవ్వకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకులకు చెందిన అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తెలిపింది. ఎవరైనా కేవైసీ అప్‌డేట్ పేరుమీద ఫోన్ చేయడం, మెసేజ్ రూపంలో అడిగితే ఖాతాదారులు తమ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదించాలని ఆర్‌బీఐ తన నోటిఫికేషన్లో వివరించింది. ఇదివరకటి కంటే ఇప్పుడు కేవైసీ అప్‌డేట్ ప్రక్రియను సరళతరం చేశామని ఆర్‌బీఐ పేర్కొంది. కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సిన ఖాతాలపై రెగ్యూలేటరీ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఆదేశాలు ఉంటే తప్ప ఎటువంటి ఆంక్షలు విధించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రస్తుత ఏడాది డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed