సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ ‘మాస్టర్ డైరెక్షన్’

by Harish |   ( Updated:2021-02-19 07:52:58.0  )
సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ ‘మాస్టర్ డైరెక్షన్’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులతో పాటు డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. దీనికోసం ‘మాస్టర్ డైరెక్షన్’ పేరున కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న క్రమంలో మోసాలు, అడ్డంకులు, సైబర్ నేరాలు పెరిగిన సంఘటనలు చూసిన తర్వాత ఈ నిబంధనలను రూపొందించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకనటలో పేర్కొంది. డిజిటల్ పేమెంట్, మనీ ట్రాన్స్‌ఫర్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఆర్‌బీఐ తన మార్గదర్శకాల్లో వివరించింది.

బ్యాంకులు కొత్త యాప్‌ను విడుదల చేసిన ఆరు నెలల్లోగా పాత మొబైల్ యాప్‌ను తొలగించాలని అందులో స్పష్టం చేసింది. ప్రజలకు అవగాహన పెంచేందుకు, డిజిటల్ చెల్లింపుల విషయంలో వినియొగదారులు ఎదుర్కొనే సైబర్ దాడుల గురించి ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అలాంటి మోసాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో వివరించాలని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో వెల్లడించింది.

Advertisement

Next Story