యెస్‌బ్యాంకుకు ఆర్‌బీఐ రుణం!

by Harish |
యెస్‌బ్యాంకుకు ఆర్‌బీఐ రుణం!
X

దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు వ్యవహారంలో ఆర్‌బీఐ మరో ముందడుగు వేసింది. డిపాజిటర్ల సొమ్మును నష్టపోకుండా చూసుకునే బాధ్యత తమదేనని, వారి సొమ్మును తిరిగిచ్చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర రుణం కింద రూ. 60,000 కోట్లను ఆర్‌బీఐ ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం నుంచి యెస్ బ్యాంకు కార్యకలాపాలు మొదలయ్యాయి. 2004లో ఆర్‌బీఐ ఇదే తరహాలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుకు సైతం రుణమిచ్చింది. మళ్లీ పదహారేళ్ల తర్వాత ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అప్పట్లో ఆ బ్యాంకును అదే ఏడాది ఆగష్టులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న అత్యవసర రుణాన్ని యెస్ బ్యాంకు కరెంట్ అకౌంట్‌కు అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది.

అయితే, గురువారం నుంచి యెస్ బ్యాంక్ కార్యకలాపాలు సాధారణంగా మొదలయ్యాయి. మారటోరియం ఎత్తేసినప్పటికీ ఎక్కువ బ్రాంచ్‌లు ఖాళీగా కనిపించడం విశేషం. సుమారు రెండు వారాల అనంతరం బుధవారం సాయంత్రం నుంచి యెస్ బ్యాంక్ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి. అయినా సరే ఖాతాదారులు ఎవరూ రాలేదు. ఒకరకంగా దీనికి కరోనా భయం కూడా కారణం అవ్వొచ్చు. అందుకే ఖాతాదారులెవ్వరూ బ్యాంకుకు వెళ్లలేదని తెలుస్తోంది.

tags : rbi, yes bank, credit,

Advertisement

Next Story