- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నాలుగు బ్యాంకులకు RBI జరిమానా..
దిశ, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా సిటీ యూనియన్ బ్యాంకు సహా మరో మూడు బ్యాంకులపై ఆర్‌బీఐ భారీగా జరిమానా విధించింది. వ్యవసాయ రుణాలతో పాటు విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో నిబంధనలను పాటించని కారణంతో సిటీ యూనియన్ బ్యాంకుపై రూ. కోటి జరిమానాను విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
అలాగే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించడంతో తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుకు రూ. కోటి జరిమానా విధించింది. అదేవిధంగా, డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ, ఫ్రాడ్ కేసుల పర్యవేక్షణ, రిపోర్టింగ్ మెకానిజం సర్క్యులర్ ఆదేశాలను పాటించనందుకు అహ్మదాబాద్ నూటన్ నగరిక్ సహకార బ్యాంకుకు రూ. 90 లక్షలు, ఆర్‌బీఐ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్-2017, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆదేశాలను పాటించని కారణంతో పూణె దైంలర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 10 లక్షల జరిమానా ఆర్‌బీఐ విధించింది.