ఆ 5 రంగాలు ఆర్థిక వ్యవస్థకు కీలకం

by Harish |
ఆ 5 రంగాలు ఆర్థిక వ్యవస్థకు కీలకం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని 5 కీలక రంగాల్లో కీలకమైన మార్పులు జరిగాయని, అవి ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..వ్యవసాయం, ఇంధన శక్తి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సరఫరా వ్యవస్థ, మౌలిక వసతులైన 5 రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు తన స్థానాన్ని సుస్థిరపరుకుంటుందని దాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శక్తికాంత దాస్ వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలను ప్రస్తావించారు.

రైతుల ఆదాయం పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడిందన్నారు. ఇంధన రంగలో భారత్ గత ఐదేళ్లలో ఎంతో వృద్ధి సాధించినట్టు పేర్కొన్నారు. ఈ మార్పు దేశ ఇంధన కొరతను అధిగమించడానికి సాయంగా ఉండనున్నట్టు దాస్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధార సేవలను అందించే దేశంగా భారత్ మారుతోందని, కానీ అంతర్జాతీయ ఇమిగ్రేషన్ విషయంలో ఉన్న ఒడిదుడుకులను దాస్ ప్రస్తావించారు. ఇక, మౌలికవసతుల అభివృద్ధిని గమనిస్తే..ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కీలకంగా ఉన్నట్టు, దీంతో దేశంలో ఇంకా పెట్టుబడులు వస్తాయని దాస్ అభిప్రాయపడ్డారు. కాగా, అంతర్జాతెయంగా సరఫరా వ్యవస్థ వాటాను భారత్ మరింత పెంచుకోవాల్సిన అవసరముందని దాస్ తెలిపారు. ఈ రంగం అభివృద్ధికి యూకే, అమెరికా, యూరప్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడమే మార్గమని శక్తికాంత దాస్ తెలిపారు.

Advertisement

Next Story